Modern European History MCQ QUIZ ONLINE TEST and General knowledge is very helpful for AP DSC, TS DSC UPSC, apspsc, SSC IBPS exam and all other competitive exams.world history quiz in telugu
Question 1: పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఏ దేశంలో సంభవించింది ?
A) ఇంగ్లాండ్
B) ప్రాన్స్
C) జర్మనీ
D) ఇటలీ
Explanation:పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఇంగ్లాండ్ దేశంలో 18 వ శతాబ్దం ఆరంభంలో సంభవించింది
Question 2: పోర్చుగీసు నావికుడైన వాస్కోడగామా ఏ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ?
A)1495
B) 1496
C) 1497
D) 1498
Explanation:పోర్చుగీసు నావికుడైన వాస్కోడగామా 1498 సంవత్సరంలో ఆఫ్రికాను చుట్టిముట్టి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు
Question 3:17 వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్ ని పాలించిన రాజవంశం ?
A) హాబ్స్ బర్గ్
B) బూ ర్బన్
C) ట్యూడర్
D) పైవన్నీ
Explanation: 17 వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్ ని పాలించినది ట్యూడర్ రాజవంశం
Question 4:రక్తపాత రహిత విప్లవం ఏ దేశంలో సంభవించింది ?
A) ఇంగ్లాండ్
B) ప్రాన్స్
C) రష్యా
D) అమెరికా
Explanation:రక్తపాత రహిత విప్లవం ఇంగ్లాండ్ దేశంలో 1688 వ సంవత్సరంలో సంభవించింది. ఈ విప్లవాన్ని మహోన్నత విప్లవం అని కూడా అంటారు.
Question 5:ప్రపంచంలోనే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం మొట్టమొదట అమలు కాబడిన దేశం ఏది ?
A) అమెరికా
B) ఇంగ్లాండ్
C) భారత దేశం
D) ఆస్ట్రేలియా
Explanation: పార్లమెంటరీ ప్రభుత్వ విధానం మొట్టమొదట అమలు కాబడిన దేశం ఇంగ్లాండ్ .
Question 6: కింది వారిలో అమెరికా ఖండాన్ని కనుగొన్న వారు ఎవరు ?
A) మాజిలాన్
B) వాస్కోడగామా
C) ఫెర్డినాండ్
D) కొలంబస్
Explanation:1492 వ సంవత్సరంలో కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్నారు .
Question 7:అమెరికా దేశ స్వతంత్ర పోరాటంలో సహాయం చేసిన యూరో పియన్ దేశం ?
A) ప్రాన్స్
B) ఇటలీ
C) జర్మనీ
D) రష్యా
Explanation:అమెరికా దేశ స్వతంత్ర పోరాటంలో సహాయం చేసిన యూరో పియన్ దేశం ప్రాన్స్
Question 8:అమెరికా స్వతంత్ర ప్రకటనను రచించిన వారు ఎవరు ?
A) జార్జ్ వాషింగ్ టన్
B) థామస్ జెఫర్ సన్
C) థామస్ పెయిన్
D) పైవారందరు
Explanation: అమెరికా స్వతంత్ర ప్రకటనను రచించిన వారు థామస్ జెఫర్ సన్. ఈ స్వాతంత్ర్య ప్రకటనను ఫిలడెల్ఫియా మూడవ కాంగ్రెస్ 1776 జులై 4 న ఆమోదించింది.
Question 9: ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్ లుగా విభజించ బడింది ?
A) 4
B) 3
C) 2
D) 5
Explanation: ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్ లుగా విభజించ బడింది. అవి మొదటి ఎస్టేట్ మతాధిపతులు , రెండవ ఎస్టేట్ కులీన వర్గం, మూడవ ఎస్టేట్ పెద్ద వ్యాపారస్తులు, న్యాయ వాదులు, అధికారులు మొదలగు వారు.
Question 10:చర్చి విధించిన పన్ను కింది వానిలో ఏది ?
A) టైద్
B) టెయిలే
C) బెగర్
D) జిజియా
చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10 వ వంతు చర్చికి చెల్లించాలి
Question 11:ప్రభుత్వ అంగాల మధ్య అధికార విభజన ఉండాలని "ద స్పిరిట్ ఆఫ్ ద లాస్" అన్న గ్రంథాన్ని ఎవరు రచించారు ?
A) జాన్ లాక్
B) రూసో
C) మాంటెస్క్యూ
D) బెంథామ్
ఈ పుస్తకంలో మాంటెస్క్యూ, అధికారాన్ని శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల మధ్య విభజించాలని ప్రతిపాదించాడు
Question 12:"సోషల్ కాంట్రాక్ట్ " అన్న పుస్తకాన్ని ఎవరు రచించారు ?
A) జాన్ లాక్
B) రూసో
C) మాంటెస్క్యూ
D) బెంథామ్
రూసో ఈ పుస్తకంలో ప్రజలు, వాళ్ళ ప్రతినిధుల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా ప్రభుత్వం పనిచేయాలని ప్రతిపాదించాడు
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
Percentage: 0%
Very good
ReplyDelete