Soils in India mcq online test is very useful for AP DSC, AP TET, APPSC, and all other exams. World geography mcq is very useful for dsc aspirants.
Question 1: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రకారం దేశంలోని నేలలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది ?
A) 7
B) 8
C) 6
D) 5
Explanation:భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రకారం దేశంలోని నేలలను ఎనిమిది రకాలుగా వర్గీకరించింది. అవి 1) ఒండ్రుమట్టి నేలలు 2) నల్లరేగడి నేలలు 3) ఎర్ర నేలలు 4) లాటరైట్ నేలలు 5) ఎడారి నేలలు 6)ఆమ్ల , క్షార నేలలు 7) అటవీ నేలలు 8) పీట్/జీవ సంబంధ నేలలు
Question 2: నదుల నిక్షేపణ ఆధారంగా ఏర్పడిన నేలలు ఏవి ?
A) ఒండ్రు మట్టి నేలలు
B) నల్లరేగడి నేలలు
C) ఎర్ర నేలలు
D) పర్వత మృత్తికలు
Explanation:నదుల ద్వారా జరిగే క్రమక్షయం, రవాణా, నిక్షేపణ ద్వారా ఏర్పడతాయి.హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదుల ద్వారా ఈ నేలలు ఏర్పడతాయి.
Question 3:నదీ లోయలకు దగ్గరగా ఏర్పడిన నవీన ఒండ్రు మైదానాన్ని ఏమని పిలుస్తారు ?
A) భంగర్
B) ఖాదర్
C) తెరయి
D) బాబర్
Explanation:నదీ లోయలకు దగ్గరగా ఏర్పడిన నవీన ఒండ్రు మైదానాన్ని ఖాదర్ అని పిలుస్తారు.
Question 4:నదీ లోయలకు దూరంగా ఏర్పడిన ప్రాచీన ఒండ్రు మైదానాన్ని ఏమని పిలుస్తారు ?
A) భంగర్
B) ఖాదర్
C) బాబర్
D) తెరయి
Explanation:నదీ లోయలకు దూరంగా ఏర్పడిన ప్రాచీన ఒండ్రు మైదానాన్ని భంగర్ అని పిలుస్తారు
Question 5: శివాలిక్ పర్వత పాదాల వద్ద కనపడే గులక రాళ్ళతో కూడిన సచ్చీద్ర మండలాన్ని ఏమని పిలుస్తారు ?
A) భాబర్
B) ఖాదర్
C) తెరయి
D) భంగర్
Explanation: శివాలిక్ పర్వత పాదాల వద్ద కనపడే గులక రాళ్ళతో కూడిన సచ్చీద్ర మండలాన్ని భాబర్ అని పిలుస్తారు.వ్యవసాయ సాగుకు పనికి రాణి భూమి .
Question 6: తేమతో కూడిన చిత్తడి ప్రాంతాన్నిఏమని పిలుస్తారు ?
A) భాబర్
B) ఖాదర్
C) భంగర్
D) తెరయి
Explanation:తేమతో కూడిన చిత్తడి ప్రాంతాన్ని తెరయి పిలుస్తారు .
Question 7:భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు ?
A) డిల్లీ
B) ముంబయి
C) కలకత్తా
D) చెన్నై
Explanation: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం డిల్లీలో గలదు
Question 8:తమకు తాము దున్నుకొనే నేలలు అని ఏ నేలలును పిలుస్తారు ?
A) ఒండ్రు నేలలు
B) నల్లరేగడి నేలలు
C) ఎర్ర నేలలు
D) లేటరైట్ నేలలు
Explanation: తమకు తాము దున్నుకొనే నేలలు నల్లరేగడి నేలలును పిలుస్తారు
Question 9: బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు కింది వాటిలో ఏవి ?
A) ఒండ్రు నేలలు
B) నల్లరేగడి నేలలు
C) లేటరైట్ నేలలు
D) అటవీ నేలలు
Explanation: బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు నల్లరేగడి నేలలు
Question 10:పురాతన స్పటికాకార రూపాంతర శిలలు శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు ఏవి ?
A) ఒండ్రు నేలలు
B) నల్లరేగడి నేలలు
C) ఎర్ర నేలలు
D) లాటరైట్ నేలలు
పురాతన స్పటికాకార రూపాంతర శిలలు శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు ఎర్ర నేలలు
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
Percentage: 0%