Andhra history SATHAVAHANA DYNASTY Questions and Answers is very useful for RRB, NTPC, AP TET DSC, SSC etc.,
శాతవాహన రాజులలో మొదటి రాజు ఎవరు?
Ans:- శ్రీముఖుడు
మొదటి శాతవాహన రాజుల యొక్క రాజధాని ఏది?
Ans:- పైతాన్ లేదా ప్రతిష్టాన్
శాతవాహన రాజుల అధికార భాష ఏది?
Ans:- ప్రాకృతం
గుణాడ్యుడు రచించిన గ్రంథం ఏది?
Ans:- బృహత్కథ
ఏ శాతవాహన రాజు పరిపాలనా కాలంలో సంస్కృతం రాజభాష అయింది?
Ans:- కుంతల శాతకర్ణి
హాలుడు రచించిన గ్రంథం ఏది?
Ans:- గాథాసప్తశతి
ధరణికోట రాజధానిగా పరిపాలించిన శాతవాహన రాజులలో గొప్ప చక్రవర్తి ఎవరు?
Ans:- గౌతమీపుత్ర శాతకర్ణి
నాసిక్ శాసనం వేయించిన వారు ఎవరు?
Ans:- గౌతమీ బాలశ్రీ
శకరాజైన సహపాణుని ఓడించిన శాతవాహన రాజు ఎవరు?
Ans:- గౌతమి పుత్ర శాతకర్ణి
ఏక బ్రాహ్మణ, అగమనిలయ,
త్రీ సముద్రాధీశ్వర అను బిరుదులు గల శాతవాహన రాజు ఎవరు?
Ans:- గౌతమీపుత్ర శాతకర్ణి
శకరాజు రుద్రధమనుడు వేయించిన శాసనం?
Ans:- జునాగడ్ శాసనం
శాతవాహన చివరి రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు?
Ans:- యజ్ఞశ్రీ శాతకర్ణి
నాగార్జున కొండ వద్ద పారావత విహారాన్ని కట్టించిన శాతవాహన రాజు ఎవరు?
Ans:- యజ్ఞశ్రీ శాతకర్ణి
శర్మ వర్మ రచించిన వ్యాకరణం?
Ans:- కాతంత్ర వ్యాకరణం
అర్థశాస్త్ర గ్రంథ రచయిత ఎవరు?
Ans:- కౌటిల్యుడు
ఇండికా గ్రంథ రచయిత ఎవరు?
Ans:- మెగస్తనీస్
యజ్ఞశ్రీ శాతకర్ణి కి సమకాలీకుడు ఎవరు?
Ans:- ఆచార్య నాగార్జునుడు
బౌద్ధ తత్వశాస్త్రంలో మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
Ans:- ఆచార్య నాగార్జునుడు
స్రుహాళ్లేఖ, ప్రజ్ఞపారమిత అను గ్రంథాలను రచించిన వారు ఎవరు?
Ans:- ఆచార్య నాగార్జునుడు

