Indian Constitution
1. ఏ చట్టం ద్వారా సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు?
Ans:- 1773 రెగ్యులేటింగ్ చట్టం
2. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పడిన సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు
Ans:- కలకత్తా
3. బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చిన చట్టం ఏది?
Ans:- 1773 రెగ్యులేటింగ్ చట్టం
4. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పడిన మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు?
Ans:- వారన్ హేస్టింగ్స్
5. భారతదేశంలో ద్వంద్వ పాలనకు నాంది అని ఏ చట్టాన్ని పిలుస్తారు?
Ans:- 1784 పిట్ ఇండియా చట్టం
6. సంవత్సరానికి భారతీయ విద్యావ్యాప్తి కోసం లక్ష రూపాయలు కేటాయించాలని ఏ చట్టం పేర్కొంది?
Ans:- 1813 చార్టర్ చట్టం
7. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియా గవర్నర్ జనరల్ హోదాగా మార్చిన చట్టం ఏది?
Ans:- 1833 చార్టర్ చట్టం
8. ఏ చట్టం ద్వారా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు?
Ans:- 1833 చార్టర్ చట్టం
9. ఏ చట్టం ద్వారా కంపెనినీ పరిపాలన నుండి తప్పించి, బ్రిటిష్ ప్రభుత్వమే నేరుగా భారతదేశాన్ని పరిపాలించడానికి అధికారం కల్పించింది?
Ans:- 1858 భారత ప్రభుత్వ చట్టం
10. శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించిన చట్టం ఏది?
Ans:- 1861 కౌన్సిల్ చట్టం.
11. మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన చట్టం ఏది?
Ans:- 1909 మింటో మార్లే చట్టం
12. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి లో మొట్టమొదటిసారిగా సభ్యత్వం పొందిన భారతీయుడు ఎవరు?
Ans:- సత్యేంద్ర ప్రసాద్ సిన్హా
13. మత నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
Ans:- లార్డ్ మింటో
14. రాష్ట్రాల స్థాయిలో ద్వంద్వ (Diarchy) పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది?
Ans:- 1919 భారత ప్రభుత్వ చట్టం (మాంటెంగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు)
15. 1919 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాల అధికారాలను ఎన్ని రకాలుగా విభజించారు?
Ans:- 2 రకాలు (1. రిజర్వు అంశాలు 2. ట్రాన్సఫర్డ్ అంశాలు)
16. మొట్టమొదటిసారిగా కేంద్ర స్థాయిలో ఏ చట్టం ద్వారా ద్వి సభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది?
Ans:- Ans:- 1919 భారత ప్రభుత్వ చట్టం
17. భారత హై కమిషనర్ అనే పదవిని ఏ చట్టం ద్వారా సృష్టించడం జరిగింది?
Ans:- 1919 భారత ప్రభుత్వ చట్టం
18. అఖిల భారత సమాఖ్యను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
Ans:- 1935 భారత ప్రభుత్వ చట్టం
19. ఏ చట్టం ద్వారా రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను రద్దుచేసి కేంద్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టినది?
Ans:- 1935 భారత ప్రభుత్వ చట్టం
20. ఫెడరల్ కోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
Ans:- 1935 భారత ప్రభుత్వ చట్టం
21. ఏ చట్టం ద్వారా భారతదేశము నుండి బర్మాను వేరు చేసినది?
Ans:- 1935 భారత ప్రభుత్వ చట్టం
22. ఫెడరల్ సర్వీస్ కమిషన్ ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
Ans:- 1935 భారత ప్రభుత్వ చట్టం
23. ప్రాంతాల స్వయం ప్రతిపత్తి అనేది ఏ చట్టం ద్వారా ఇవ్వబడింది?
Ans:- 1935 భారత ప్రభుత్వ చట్టం
24. ఏ ప్రతిపాధనలను దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీన వేసిన చెక్కు వంటిది అని గాంధీజీ విమర్శించారు
Ans:- క్రిప్స్ ప్రతిపాదనలు 1942
25. క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటయింది?
Ans:- 1946.
26. ఏ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటయింది?
Ans:- క్యాబినెట్ మిషన్.
27. 1934లో రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదట వ్యక్తపరిచిన వ్యక్తి ఎవరు?
Ans:- M. N. రాయ్
28. రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి?
Ans:- 1946 జూలై
29. మొదటి రాజ్యాంగ పరిషత్ లోని మొత్తం సభ్యుల సంఖ్య?
Ans:- 389
30. దేశ విభజన జరిగిన తర్వాత రాజ్యాంగ పరిషత్ లోని సభ్యుల సంఖ్య?
Ans:- 299.
31. రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
Ans:- డిసెంబర్ 9, 1946.
32. భారత జాతీయ కాంగ్రెస్ ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేసింది?
Ans:- మోతీలాల్ నెహ్రూ 1928, మే 19
33. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయి నామినేట్ అయిన ప్రముఖ వ్యక్తి ఎవరు?
Ans:- సర్వేపల్లి రాధాకృష్ణన్
34. రాజ్యాంగ పరిషత్‌కు కార్యదర్శి ఎవరు?
Ans:- H. B. అయ్యంగార్
35. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు?
Ans:- సచ్చిదానంద సిన్హా
36. ఏ చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో ద్వి సభా పద్ధతిని ప్రవేశపెట్టినారు
Ans: 1919 మాంటెంగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు
37. ఎన్నవ ఆర్టీకల్ ప్రకారం పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోకసభ, రాజ్యసభ
Ans: 79 వ ప్రకరణ
38. మొదటి లోకసభ సభలో ఎంతమంది సభ్యులు ఉండేవారు?
Ans: 525
39. ప్రస్తుత లోకసభ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
Ans:- 545
40. 2001 లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరం వరకు లోక్ సభ సభ్యుల సంఖ్య మారదు?
Ans:- 2026
41. సార్వజనీన వయోజన ఓటు హక్కు ఎన్నవ ఆర్టికల్ ప్రకారం ఇవ్వబడుతుంది?
Ans:- 326
42. ఓటింగ్ వయస్సును 21 సంవత్సరముల నుండి 18 సంవత్సరాలకు ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు?
Ans:- 1988లో చేసిన 61వ రాజ్యాంగ సవరణ.
43. ఏ ప్రకరణ ప్రకారం లోక్ సభ పదవీకాలం ఐదు సంవత్సరాలు
Ans: ప్రకరణ 83
44. ఏ సభ ను శాశ్వత సభ అని పిలుస్తారు?
Ans:- రాజ్యసభ
45. రాజ్యసభ సభ్యులు ఎన్ని సంవత్సరాలు ఒకసారి ⅓వ వంతు పదవి విరమణ చేస్తారు?
Ans:- 2 సంవత్సరాలకొక సారి
46. ఎన్నవ ప్రకరణ ప్రకారం పార్లమెంటు సంవత్సరంలో కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి
Ans:- ప్రకరణ 85
47. పార్లమెంటు సభ్యుల అనర్హత గురించి ఎన్నో ఆర్టికల్ లో పేర్కొన్నారు?
Ans:- 102 ప్రకరణ
48. భారతదేశ మొట్టమొదటి స్పీకర్ ఎవరు?
Ans: జి. వి. మౌలంకర్
49. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే అంశాన్ని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది?
Ans: స్పీకర్
50. స్వాతంత్రం రాకమునపు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినది ఎవరు?
Ans: సచ్చిదానంద సిన్హా
51. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి స్పీకర్ గా పనిచేసినది ఎవరు?
Ans: అనంతశయనం అయ్యంగార్.

